Lal Salaam: దివంగత గాయకులతో ‘లాల్‌ సలామ్‌’లో పాట

సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్‌ దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి ‘లాల్‌ సలామ్‌’ చిత్రంలో పాడించనున్నారు.

Updated : 31 Jan 2024 09:40 IST

కృత్రిమ మేధస్సుతో ఏఆర్‌ రెహమాన్‌ ప్రయోగం

సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్‌ దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి ‘లాల్‌ సలామ్‌’ చిత్రంలో పాడించనున్నారు. ‘తిమిరి ఎళుడా..’ అనే ఈ సాంగ్‌ ట్రాక్‌ పూర్తిగా వాడనున్నారు. విష్ణువిశాల్‌, విక్రాంత్‌లు హీరోలుగా.. అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ కీలక పాత్రధారిగా.. ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ గాయకులిద్దరూ గతంలో రెహమాన్‌ సంగీతం సమకూర్చిన చాలా సినిమాల్లో పాడారు. ఈ సందర్భంగా ఇలాంటి ప్రయోగం సినిమా చరిత్రలోనే మొదటిసారి అని సోనీ మ్యూజిక్‌ ‘ఎక్స్‌’లో ప్రకటించింది. ‘గాయకులిద్దరి కుటుంబాల అనుమతి తీసుకున్నాం. కృత్రిమ మేధ ఆల్గరిథమ్‌ ద్వారా చనిపోయిన ఇద్దరి సింగర్ల గొంతుకను వాడుకుంటున్నాం. దీన్ని ఒక సాంకేతిక విప్లవంలాగే భావిస్తున్నాం తప్ప.. దివంగత గాయకుల గౌరవానికి ఎలాంటి భంగం కలగదు’ అంటూ రెహమాన్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. బక్యా.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘విజిల్‌’, ‘సర్కార్‌’లాంటి చిత్రాల్లో పాడగా.. హమీద్‌ ‘జెంటిల్‌మన్‌’, ‘జీన్స్‌’, ‘కాదలన్‌’ తదితర సినిమాల్లో తన గాత్రం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు