Arabic Kuthu: రికార్డు సృష్టించిన ‘అరబిక్‌ కుతు’.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

భాషతో సంబంధం లేకుండా యావత్‌ సంగీత అభిమానులను ఉర్రూతలూగించిన గీతాల్లో ‘అరబిక్‌ కుతు’ ఒకటి. ‘బీస్ట్‌’ సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో 380కిపైగా మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.

Published : 10 May 2022 00:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాషతో సంబంధం లేకుండా యావత్‌ సంగీత అభిమానులను ఉర్రూతలూగించిన గీతాల్లో ‘అరబిక్‌ కుతు’ ఒకటి. ‘బీస్ట్‌’ సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో 380కి పైగా మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలై, కొన్ని క్షణాల్లోనే మిలియన్‌ వీక్షణలు దక్కించుకుంది. ఇందులో విజయ్‌, పూజాహెగ్డే హుషారైన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అనిరుధ్‌, జొనితా గాంధీ స్వరంలో ఎంత జోష్‌ ఉందో లిరికల్‌ వీడియోనే తెలియజేసింది. ఈ పాటను ఆలపించడమే కాదు అనిరుధ్‌ తన మ్యూజిక్‌తో అదరగొట్టాడు. విజయ్‌, పూజాహెగ్డే జంటగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని