Nayanthara Vignesh: నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా..? ఆసక్తికరంగా మారిన వీడియో

తమిళ చిత్ర పరిశ్రమలో లవ్లీకపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులందరూ వీరి పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు...

Published : 15 Mar 2022 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళ చిత్ర పరిశ్రమలో లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. ఎన్నో ఏళ్ల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు.. మీ పెళ్లి ఎప్పుడు..? అంటూ సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయన్‌.. కుటుంబసభ్యుల సమక్షంలో విఘ్నేశ్‌తో తన నిశ్చితార్థమైపోయిందని, తన వేలికి ఉన్నది ఎంగేజ్‌మెంట్‌ రింగేనని, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

కాగా, తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న నయన్‌.. విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ అమ్మవారి గుడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ సిబ్బందితో వీరు ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా అది చూసిన నెటిజన్లు.. ‘‘నయనతార నుదిటిపై సింధూరం గమనించారా..! అంటే వీరి పెళ్లి అయిపోయిందా?’’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని