Dhoni: రజనీకాంత్‌ చేతిలో ధోనీ ‘అథర్వ’.. ట్రైలర్‌ చూశారా!

టీమిండియా మాజీ సారథి ధోనీ నటుడిగా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ‘అథర్వ ది ఆరిజన్‌’ పేరుతో రూపొందుతున్న గ్రాఫిక్స్‌ వెబ్‌ సిరీస్‌లో ఆయన కనిపించనున్నారు.

Published : 24 Feb 2022 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ సారథి ధోనీ నటుడిగా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ‘అథర్వ: ది ఆరిజన్‌’ పేరుతో రూపొందుతున్న గ్రాఫిక్స్‌ వెబ్‌ సిరీస్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ సిరీస్‌ తెరకెక్కేందుకు ఆధారమైన ‘అథర్వ: ది ఆరిజన్‌’ నవలను ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ తాజాగా విడుదల చేశారు. నవలకు మంచి ఆదరణ దక్కాలని, సిరీస్‌ మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సిరీస్‌ దర్శకనిర్మాతలు సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ధోనీ మాటలతో ప్రారంభమైన ఈ ‘బుక్‌ లాంచ్‌ ట్రైలర్‌’ అటు క్రీడా, ఇటు సినీ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈ సైన్స్‌ ఫిక్షన్ నవలను రాసిన రమేశ్‌ తమిల్‌మనినే సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ధోనీ ఇందులో విరోచిత పాత్రలో అలరించనున్నారు. ఈ సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని