Updated : 21 May 2022 08:07 IST

Auto Rajini: యాక్షన్‌ రజనీ

జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజనీ’.  శ్రీనివాస్‌ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఎంపీ నందిగాం సురేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర బృందం ఇటీవల ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆయనకు చూపించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవలే విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఓ భారీ షెడ్యూల్‌ చిత్రీకరించాం. అలాగే ప్రేమ్‌ రక్షిత్‌ ఆధ్వర్యంలో 150మంది డ్యాన్సర్లతో ఓ పాట తెరకెక్కించాం. జూన్‌ 10న విజయవాడలోనే మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. జులై 10 నుంచి కృష్ణపట్నం పోర్టులో క్లైమాక్స్‌ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ బాబు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని