Nagarjuna: సీఎంతో భేటీ గురించి చిరంజీవిని అడిగా.. ప్రేమ గురించి మాట్లాడేందుకే వచ్చా
‘బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్’.. రాజమహేంద్రవరంలో అట్టహాసంగా వేడుక..
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం రాజమహేంద్రవరంలో ‘బ్లాక్ బస్టర్ మీట్’ వేడుకను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘‘కొవిడ్ కారణంగా రెండేళ్లుగా సంక్రాంతి వేడుకలు సాదాసీదాగా సాగాయి. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో కళను తీసుకొచ్చిన నాగార్జున గారికి థాంక్స్. ఈ వేడుకను రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా సంతోషం. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని కన్నబాబు అన్నారు. ‘‘ఈ వేడుకను ఇక్కడ నిర్వహించినందుకు బంగార్రాజు చిత్ర బృందానికి ధన్యవాదాలు. నేనూ మా అన్నయ్య నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన స్టైల్ అనుసరించేవాళ్లం. తొలిసారి ఆయన్ను ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం చూసి ఎలా ఉందో ట్వీట్ చేస్తా’’ అని భరత్‌రామ్ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా భయపడుతున్నా.. ఉత్తరాదిలో చిత్రాల విడుదల ఆపేసినా.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయండి చూస్తాం.. మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాం అని చెప్పిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి అని మీరంతా మరోసారి నిరూపించారు. నేను వసూళ్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ గురించి మాట్లాడటానికే ఇక్కడికి వచ్చా. మీ ఆదరాభిమానాలు చూసినప్పుడల్లా మా నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు)కి థాంక్స్ చెప్పాలనిపిస్తుంటుంది. ఏపీ సీఎంతో ఇటీవల జరిగిన భేటీ గురించి మిత్రుడు చిరంజీవిని అడిగా. ‘సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్మోహన్రెడ్డి చెప్పారు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారని అందరూ అంటుంటారు. ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆయన్ను మనం గుర్తుచేసుకోవాలి. చేసుకుంటాం’’ అని అన్నారు.
‘‘రాజమహేంద్రవరంతో నాకో సెంటిమెంట్ ఏర్పడింది. ఇక్కడికి సినిమా షూటింగ్‌కి వచ్చినా, ఏదైనా వేడుకకు వచ్చినా అది సూపర్ హిట్టే. కొవిడ్ పరిస్థితుల్లో.. ఈ సినిమాను చూస్తారా? లేదా అనే సందేహంతోనే విడుదల చేశాం. మిమ్మల్ని (ప్రేక్షకులు), కథని నమ్మి ముందడుగేశాం. ఇంతటి ఆదరణ చూపిస్తారని నేను ఊహించలేదు. మీరు.. మా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ చూపించారు, బెస్ట్ కలెక్షన్లను చూపించబోతున్నారు. ఇందుకు జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటా. మంచి టీమ్ వల్లే అతి తక్కువ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. పండగకు సినిమా హిట్ అందుకుంటే ఎలా ఉంటుందో నాన్న నాకు చూపించారు’’ అని నాగ చైతన్య తెలిపారు.
వేడుకనుద్దేశించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని. ఆ మహానటుడి ఆశీస్సులు ‘బంగార్రాజు’ బ్లాక్ బస్టర్ హిట్ అవటానికి కారణమయ్యాయి. ఈ విజయం ప్రేక్షకులది. ఈ సినిమాలో నాగ చైతన్య నటన చూసి ఆశ్చర్యపోయా. ఆయన అలా నటిస్తారని నేను అనుకోలేదు. ‘మా నాగ చైతన్యగారికి ఎప్పుడు బ్లాక్ బ్లస్టర్ హిట్ వస్తుందా’ అని ఎదురుచూసిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. దర్శకుడు కల్యాణ్కృష్ణలో రాఘవేంద్రరావు కనిపించాడు. కుటుంబ విలువల గురించి ఆయన బాగా చెప్పాడు. ఈ సినిమాలో నాగార్జున గారు చెప్పిన ఓ డైలాగ్ విని ఏడ్చేశా. పండగను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని వాయిదా వేయటం వల్ల ఎక్కువ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి గారికి కృతజ్ఞతలు’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు