నాందిలో ‘జైల్‌ ఫైట్‌’ వీడియో చూశారా?

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నాంది’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ

Updated : 28 Mar 2021 21:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నాంది’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా చేయని తప్పునకు జైలులో మగ్గిపోయే బాధితుడిగా నరేశ్‌ నటన మెప్పించింది.

ఇక వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌ ఉత్తమన్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘బ్యాటిల్‌ ఫర్‌ బెయిల్‌’ పేరుతో జైలు ఫైట్‌ సీన్‌ వీడియోను విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని