Power Star: పవన్‌కు ‘పవర్‌స్టార్’ ట్యాగ్ ఎవరిచ్చారంటే!
అభిమానులకు ఊపు తెచ్చే పవర్‌స్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: చిరంజీవి సోదరుడిగా వెండితెరకు పరిచయమైనా తనదైన నటన, స్టైల్, మేనరిజం, ఫైట్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్‌కల్యాణ్. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. ఇక ఏ హీరో ఫంక్షన్ జరిగినా అక్కడ ‘పవర్‌స్టార్’ అనే నినాదం తప్పకుండా వినిపిస్తుంది. అదే పవన్ కల్యాణ్ కార్యక్రమం అయితే, అభిమానులు ‘పవర్‌స్టార్’ జపం తప్ప మరొకటి ఉండదు. మరింత ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా? రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి.
పవన్ కథానాయకుడిగా నటించిన ‘గోకులంలో సీత’ చిత్రానికి స్క్రిప్ట్ రాసింది పోసాని కృష్ణ మురళీనే. ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో పవన్‌కల్యాణ్ ‘పవర్‌స్టార్’ అవుతారు’’ అని చెప్పారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడంతో పవన్ తర్వాతి చిత్రం ‘సుస్వాగతం’ నుంచి ఆయన్ను పవర్‌స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. ‘ధృవ’ చిత్ర ఆడియో కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని పోసాని గుర్తు చేసుకున్నారు. అదండీ ‘పవర్‌స్టార్’ట్యాగ్ వెనుక కథ.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!