Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ నటి బలవన్మరణానికి పాల్పడింది.

Published : 26 Mar 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన యువ నటి ఆకాంక్ష దుబే (Akanksha Dubey) (25) బలవన్మరణానికి పాల్పడింది. తన తదుపరి ప్రాజెక్ట్‌ షూట్‌ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లిన ఆమె.. షూట్‌ పూర్తైన వెంటనే హోటల్‌ రూమ్‌కు చేరుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చనిపోవడానికి ముందు ఓ వీడియో..!

నటనపై ఉన్న ఆసక్తితో ఆకాంక్ష (Akanksha Dubey) సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ‘మేరీ జంగ్‌ మేరా ఫైస్లా’ అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఆమె.. మొదటి సినిమాతో మంచి మార్కులు దక్కించుకుంది. అలా, ఆమె భోజ్‌పురి భాషలో పలు చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే అభిమానులకు చేరువగా ఉండేందుకు ఆమె సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. తరచూ రీల్స్‌ క్రియేట్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుండేది. శనివారం రాత్రి కూడా భోజ్‌పురిలోని ఓ పాపులర్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేసింది. ఇంతలోనే, ఉన్నట్టుండి ఆకాంక్ష ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె అభిమానులు షాక్‌ అవుతున్నారు. కారణాలు ఏమై ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆకాంక్ష తన సహనటుడు సమర్‌ సింగ్‌తో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలలో అధికారికంగా వెల్లడించారు. ఆకాంక్ష మృతి చెందినప్పటి నుంచి సమర్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు