Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ సీజన్‌-7 చివరి కెప్టెన్‌ ఎవరు? ఒక్క ఛాన్స్‌ అంటూ కన్నీటి పర్యంతమైన అమర్‌!

Published : 24 Nov 2023 17:04 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7లో (Bigg Boss Telugu 7) ఈ వారం  కెప్టెన్సీ టాస్క్‌ ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌కు చివరి కెప్టెన్‌ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. తెరపై కనిపించే రెండు ఫొటోల్లో ఎవరైతే కెప్టెన్‌ కాకూడదని అనుకుంటున్నారో అతడిని మెషీన్‌గన్‌తో కాల్చాలని బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇద్దరు కంటెస్టెంట్‌లు ఏకాభిప్రాయానికి వచ్చి తెరపై కనిపించే ఒక కంటెస్టెంట్‌ ఫొటోను కాల్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శోభ, శివాజీల ఎదురుగా అమర్‌, అర్జున్‌ ఫొటోలను బిగ్‌బాస్‌ ఉంచాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. అమర్‌ను శోభ సపోర్ట్‌ చేయగా, అర్జున్‌ను శివాజీ సపోర్ట్‌ చేశాడు. ‘నేను కెప్టెన్‌ అవ్వాలని మా అమ్మ, నాన్న కూడా ఆశపెట్టుకున్నారు అన్నా’ అని అంటూ అమర్‌ కన్నీటి పర్యంతమవుతూ శివాజీని వేడుకున్నాడు. మరి శోభ, శివాజీలు ఏకాభిప్రాయానికి వచ్చి ఎవరిని కెప్టెన్‌ చేశారో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని