Chiranjeevi: చిరు ‘లూసిఫర్‌’ రీమేక్‌లో ఈ బాలీవుడ్‌ నటుడు?

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రస్తుతం ఆయన మళయాల చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో కొనిదెల ప్రొడక్షన్స్‌, ఎన్‌వీఆర్‌ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు..

Published : 17 Aug 2021 20:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌, ఎన్‌వీఆర్‌ సినిమా సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు సినీ అభిమానులకు ఊహించని బహుమతి ఇవ్వనున్నారా? ఇదే విషయమై సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌.. చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో తెర పంచుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర విషయమై చిత్ర నిర్మాతలు సల్మాన్‌ను సంప్రదించినట్లు, దీనికి ఆయనకూడా ఓకే చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  మరోవైపు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు పండగే! ఇది చిరంజీవి 153వ సినిమా. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని