Alia Bhatt: ఆ అవార్డును ఆలియాకు అంకితమిచ్చిన రేఖ.. కామెంట్స్ వైరల్
తాను స్వీకరించిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డును ఆలియాభట్‌కు అంకితమిస్తున్నానని తెలిపారు ప్రముఖ నటి రేఖ.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటి రేఖ (Rekha)కు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- 2023 (Dada Saheb Phalke International Film Festival) అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవకు గుర్తుగా ఆనరరీ విభాగంలో ఆ పురస్కారం లభించింది. ముంబయి వేదికగా ఫిబ్రవరిలో జరిగిన ఆ అవార్డుల ప్రదానోత్సవంలో ఆలియాభట్‌పై రేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. కారణమేంటంటే? సంబంధిత ప్రోమో నెట్టింట విడుదలకావడం. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యక్ష ప్రసారం ఓ ఓటీటీలో స్ట్రీమింగ్‌కాగా రికార్డెడ్ దృశ్యాలు ఓ ప్రముఖ ఛానల్‌లో ఆదివారం టెలికాస్ట్ అయ్యాయి. ప్రచారంలో భాగంగా సంబంధించి ఛానల్ సెకన్ల నిడివి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అందులో.. ట్రోఫీని స్వీకరించిన అనంతరం రేఖ, ఆలియా భట్ (Alia Bhatt) వేదికపైకి ఉండడం కనిపించింది. రేఖ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును ఆలియాకు అంకితమిస్తున్నా. ఆమె ఫ్యూచర్ లెజెండ్’’ అంటూ ప్రశంసించారు. సీనియర్ నటి లెజెండ్ అని వ్యాఖ్యానించడంతో ఆలియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదే వేడుకలో ఆలియా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘గంగూబాయి కాఠియావాడి’లోని నటనకుగాను ఆమెను ఆ పురస్కారం వరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..!
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!