Brahmanandam: నవరసాలు పలికిస్తే..!

ఆయనను చూడగానే ఎంత కష్టంలో ఉన్నా మనసు ప్రశాంతత పొందుతుంది. ముఖంపై చిరునవ్వు మొలకెత్తుతుంది. బాధను

Updated : 05 Jun 2021 18:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆయనను చూడగానే ఎంత కష్టంలో ఉన్నా మనసు ప్రశాంతత పొందుతుంది.. ముఖంపై చిరునవ్వు మొలకెత్తుతుంది.. బాధను మరిపించగల దివ్య ఔషధం ఆయన నటన.. చిన్నా పెద్ద తేడా లేకుండా కితకితలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. వాట్సాప్‌ రూపొందించిన ఇమోజీలు కూడా ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ ముందు దిగతుడుపే.. ఆయనే తెలుగు సినీ ప్రేక్షకులకు వరంగా దొరికిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం. అగ్ర కథానాయకుడు చిరంజీవి వ్యాఖ్యాతగా ఒకప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి బ్రహ్మానందం విచ్చేసి ‘నవరసాలు’ పలికించి కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు చూసిన ఆ వీడియో ఎవర్‌గ్రీన్‌. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఆ వీడియోను ఈ వీకెండ్‌లో మరోసారి చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని