Chiranjeevi: ‘బేబీ’ టీమ్‌తో చిరు మీట్‌.. కన్నీళ్లు వచ్చేశాయంటూ సాయి ట్వీట్‌

‘బేబీ’ (Baby) టీమ్‌ను చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేకంగా మీట్‌ అయ్యారు. సినిమా తనకెంతో నచ్చిందంటూ టీమ్‌ను మెచ్చుకున్నారు.

Published : 28 Jul 2023 18:33 IST

హైదరాబాద్‌: చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోన్న చిత్రం ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకుడు. సుమారు రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని తాజాగా అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi) వీక్షించారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు సాయిరాజేశ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సాయి రాజేశ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘‘నా కల నెరవేరిన రోజు ఇది. సినిమా విషయంలో నేను దేవుడిగా ఆరాధించే వ్యక్తితో రెండు గంటల సమయాన్ని గడిపాను. నేను దర్శకత్వం వహించిన ‘బేబీ’ చిత్రం ఆయనకెంతో నచ్చింది. సినిమాకు సంబంధించిన ప్రతి వర్క్‌ను ఆయన మెచ్చుకున్నారు. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. రెండు గంటలు బాబాయ్‌ రెండు గంటలు..!! బాస్‌ మాట్లాడుతుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ‘బేబీ’ మూవీకి సంబంధించిన ఓ ‘మెగా’ ఈవెంట్‌ త్వరలోనే రానుంది’’ అని సాయి రాజేశ్‌ ట్వీట్‌ చేశారు.

Police Story Review: రివ్యూ: పోలీస్‌ స్టోరీ.. ఐటీ ఉద్యోగిని చంపిందెవరు?

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా తమకెంతో నచ్చిందంటూ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ ప్రత్యేకంగా ఈవెంట్స్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ముఖ్య అతిథిగా త్వరలో బేబీ ‘మెగా’ ఈవెంట్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు