Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అవసరమైన వారికి చేయూతనందించడంలో తాను ముందుంటానని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిస్తే చేతనైనంత సాయం చేసి తన మంచి మనసును చాటుకుంటారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలువురికి చేయూతనందించిన ఆయన తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్‌కు రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
1980-90ల్లో ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల కోసం కెమెరామెన్‌గా పనిచేసి, దక్షిణాదిలో మంచి పేరు సొంతం చేసుకున్నారు దేవరాజ్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి తారలు నటించిన చిత్రాల కోసం ఆయన పనిచేశారు. సుమారు 300లకు పైగా చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఆయన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించారు. ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అంతేకాకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్