Pushpa: ‘పుష్ప’ టీమ్‌కు తనదైన శైలిలో అభినందనలు తెలిపిన క్రికెటర్‌..!

టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన పాటలకు తనదైన శైలిలో స్టెపులు వేసి అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సన్‌రైజర్స్ మాజీ సారథి. తాజాగా డేవిడ్‌ వార్నర్ చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Published : 12 Oct 2022 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ పాటలకు తనదైన శైలిలో స్టెపులు వేసి అభిమానులను సంపాదించుకున్నాడు సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్‌ వార్నర్‌. తాజాగా వార్నర్ చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇంతకి అందులో ఏముందంటే.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ‘పుష్ప’ సినిమా ఏడు విభాగాల్లో తన సత్తాచాటి అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప టీమ్‌కు వార్నర్‌ తనదైన స్టైల్‌లో అభినందనలు తెలిపాడు. పుష్ప గెటప్‌లో ఉన్న తన ఫొటోను అల్లుఅర్జున్‌ ఫొటోతో జత చేసి పోస్ట్‌ చేశాడు.

‘’అల్లుఅర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాకు ఫిలింఫేర్‌ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో భాగమైన అందరికీ అభినందనలు’’ అంటూ అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశాడు. ఇక టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌  ‘బుట్టబొమ్మ..’, ‘మైండ్‌ బ్లాక్‌..’, పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా.., శ్రీవల్లీ..’ పాటలకు డేవిడ్‌ వార్నర్‌ డాన్స్‌ చేసి అలరించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని