SIR Review: రివ్యూ: సార్
sir movie review: ధనుష్, సంయుక్త జంటగా నటించిన ‘సార్’ మూవీ ఎలా ఉందంటే?
SIR Review; చిత్రం: సార్; నటీనటులు: ధనుష్, సంయుక్త, సాయికుమార్, తనికెళ్లభరణి, సముద్రఖని తదితరులు; సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్; ఎడిటింగ్: నవీన్ నూలి; సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్; నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య; రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి; విడుదల తేదీ:17-02-2023
తెలుగులో మార్కెట్‌ని సంపాదించిన కథానాయకుల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ అనువాదం అవుతుంటుంది. ఈసారి ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘సార్’ (SIR Movie Review) చేశారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, తెలుగు నిర్మాణ సంస్థ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ‘సార్’గా ధనుష్ అలరించారా?
కథేంటంటే: ఆర్థిక సంస్కరణలతో భారత దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్న 2000 సంవత్సర కాలం అది. ఇంజినీరింగ్ చదువులకి డిమాండ్ ఏర్పడుతుంది. ఇదే అదనుగా కొంతమంది స్వార్థపరులు విద్యని వ్యాపారంగా మార్చి డబ్బు దండుకోవడం మొదలుపెడతారు. అందులో ఒకరు... త్రిపాఠి విద్యా సంస్థల అధినేత, ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు త్రిపాఠి (సముద్రఖని). ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకి అధిక జీతాల్ని ఆశచూపుతూ తనవైపు మరల్చుకుంటాడు త్రిపాఠి. దాంతో మధ్య తరగతి, పేద పిల్లలకి ఆధారమైన ప్రభుత్వ కాలేజీలు మూతపడతాయి. ప్రైవేటు కాలేజీల్లో వేలకి వేలు ఫీజులు కట్టలేక చదువు మానేస్తారు చాలామంది విద్యార్థులు. దీనిపై ఆందోళనలు మొదలవుతాయి. దాంతో తన వ్యూహం మార్చిన త్రిపాఠి... ప్రభుత్వ కళాశాలల్ని తామే దత్తత తీసుకుని నడుపుతామని ప్రభుత్వానికి చెబుతాడు. అక్కడికి తమ కాలేజీల్లో పనిచేసే అంతగా అనుభవం లేని జూనియర్ లెక్చరర్లని పంపించి, నాణ్యత లేని చదువులతో మమ అనిపించి తన వ్యాపారాన్ని కొనసాగించాలనేది అతని వ్యూహం. (SIR Movie Review) అలా తన దగ్గర పనిచేస్తూ సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు చెప్పడానికి అపాయింట్ అయిన జూనియర్ లెక్చరరే బాలగంగాధర తిలక్ అలియాస్ బాలు సార్ (ధనుష్). సిరిపురం కాలేజీకి వెళ్లి వంద శాతం రిజల్ట్ తీసుకొస్తానని చెప్పిన బాలు సార్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బయాలజీ లెక్చరర్ మీనాక్షి (సంయుక్త) ఆయనకి ఎలా సాయం చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: 1990... 2000 దశకం నేపథ్యంలో సాగే కథే అయినా... విద్య విషయంలో నేటి పరిస్థితులకి కూడా దగ్గరగా ఉండే చిత్రమిది. విద్య గుడిలో ప్రసాదంలాంటిది. దాన్ని పంచాలి కానీ... ఫైవ్‌స్టార్ హోటల్లో వంటకంలా పంచకూడదని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. (SIR Movie Review) ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథాంశమే ఈ సినిమాకి ప్రధాన బలం. అయితే ఆ కథని నడిపిన విధానంలోనే లోటుపాట్లు కనిపిస్తాయి. నాటకీయత మరీ ఎక్కువైంది. భావోద్వేగాలే ప్రధానమైన ఈ కథలో సహజత్వం లేని సన్నివేశాల వల్ల చాలా చోట్ల సినిమా కృతకంగా సాగుతున్న భావన కలుగుతుంది. షాప్‌లో దొరికిన వీడియో క్యాసెట్ల నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళతాడు దర్శకుడు. బాలు సార్ పాత్ర పరిచయం, ఆయన సిరిపురం కాలేజీకి వెళ్లడం, తోటి అధ్యాపకులతో కలిసి చేసే సందడి ఇలా ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఊరికి వెళ్లాక ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే తీరు కూడా భావోద్వేగాల్ని పంచుతాయి. (SIR Movie Review) ముఖ్యంగా ఊరి జనాల్లో చైతన్యం నింపేలా అబ్దుల్ కలామ్ జీవిత కథని చెప్పడం, కులాల మధ్య అంతరాలు తొలగిపోయేలా పిల్లల్లో మార్పు తీసుకురావడం వంటి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. మధ్యలో నాయకానాయికల ప్రేమకథ కూడా హుందాగా సాగుతుంది. అక్కడక్కడా సినిమాటిక్‌గా అనిపించినా ప్రథమార్ధం వరకు భావోద్వేగాలతో పర్వాలేదనిపిస్తుందీ చిత్రం. ద్వితీయార్ధంలోనే మెలోడ్రామా కాస్త ఎక్కువైంది. త్రిపాఠి నుంచి ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్లని లక్ష్యం దిశగా నడిపించడం ద్వితీయార్ధంలో కనిపిస్తుంది. ఆ సన్నివేశాలు చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. (SIR Movie Review) పతాక సన్నివేశాలు కూడా సినిమా కాన్సెప్ట్‌కి విరుద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్ ర్యాంకుల దందాకి సాయం చేసినట్టే అనిపిస్తుంది. బాలీవుడ్ చిత్రం సూపర్ 30ని పోలి ఉంటుందీ చిత్రం.
ఎవరెలా చేశారంటే: బాలు సార్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. లెక్చరర్‌గా హుందాగా కనిపిస్తూ, పాత్రపై బలమైన ప్రభావం చూపించారు. భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు, కామెడీ.... ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన అలరించారు. సంయుక్త అందంగా కనిపించింది. కథానాయకుడితోపాటే కనిపించే ప్రాధాన్యమున్న పాత్ర ఆమెకి దక్కింది. త్రిపాఠిగా సముద్రఖని, సిరిపురం సర్పంచ్‌గా సాయికుమార్ బలమైన పాత్రల్లో కనిపిస్తారు. సుమంత్ అతిథి పాత్రలో మెరిశారు. ఆది ప్రథమార్ధంలో నవ్వించాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జి.వి.ప్రకాష్ సంగీతం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగాలు పండటంలో సంగీతం పాత్రప్రధానంగా కనిపిస్తుంది. యువరాజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు మంచి కథాంశాన్ని ఎంచుకున్నారు. దాన్ని వాణిజ్య హంగులతో తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. (SIR Movie Review) కథనం పరంగా చేసిన కసరత్తులే చాలలేదనిపిస్తుంది.
బలాలు : + విద్య నేపథ్యంలో కథ; + ప్రథమార్ధం; + ధనుష్ నటన
బలహీనతలు : - నాటకీయత ఎక్కువ కావడం; - పతాక సన్నివేశాలు
చివరిగా: ఈ ‘సార్’ది డీసెంట్ క్లాస్. (SIR Movie Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్‌లో ఫోన్‌పే, గూగుల్‌పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి