Dhootha: దూత రాకకు వేళాయే

‘దూత’గా ఓటీటీ వేదికపై అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు నాగచైతన్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ తొలి వెబ్‌సిరీస్‌ను విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించారు.

Updated : 16 Nov 2023 12:33 IST

‘దూత’గా ఓటీటీ వేదికపై అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు నాగచైతన్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ తొలి వెబ్‌సిరీస్‌ను విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించారు. శరత్‌ మరార్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ డిసెంబరు 1న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సూపర్‌ నేచురల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ ముస్తాబయ్యింది. చైతన్య ఇందులో సాగర్‌ అనే జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తారు. దీంట్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ఈ సిరీస్‌కు సంగీతం: ఇషాన్‌ చాబ్రా, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: మికోలజ్‌ సైగుల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని