Dil Raju: కుమారుడితో కలసి దిల్‌ రాజు అల్లరి.. వీడియో వైరల్‌

తన కుమారుడితో కలిసి దిల్‌ రాజు (Dil Raju) సరదాగా గడిపిన వీడియో వైరలవుతోంది. ఇందులో దిల్‌ రాజు కుటుంబసభ్యులంతా సందడి చేశారు.

Updated : 06 Jul 2023 17:16 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తన కుమారుడు అన్వైతో (Anvay) సరదాగా గడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అన్వై మొదటి పుట్టిన రోజు వేడుక ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. దిల్‌ రాజు కుటుంబసభ్యులంతా ఉన్న ఆ వీడియోలో కుమారుడితో కలసి ఆయన అల్లరి చేశారు. ఈ వీడియో కోసం తమన్‌ ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్‌ చేయగా సింగర్‌ కార్తిక్‌ దాన్ని పాడారు.

ఈ వీడియోలో దిల్‌ రాజు తనయుడిపై మనవడు నీళ్లు పోస్తున్న షాట్‌ కూడా వైరల్‌గా మారింది. ఇక మొదటి భార్య మరణించిన తర్వాత దిల్‌ రాజు 2020లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరికి 2022 జూన్‌ 29న అన్వై జన్మించాడు. ఇటీవల ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన అన్వై మొదటి పుట్టిన రోజు వేడుకలకు సినీ తారలు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి - సురేఖ దంపతులు, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, శ్రీలీల, గోపీచంద్‌, రాశీ ఖన్నా తదితరులు ఆ పార్టీకి హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని