Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ
‘దసరా’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వివాహం చేసుకున్నారు. గోదావరిఖనిలో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘దసరా’ (Dasara) సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odhela). ఈ చిత్ర విజయోత్సాహంలో ఉన్న ఆయన తన బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తన చిన్ననాటి స్నేహితురాలు సౌమ్యకృష్ణను బుధవారం పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి గోదావరిఖని వేదికైంది. వేడుక ఫొటోని ప్రముఖ హీరో నాని (nani) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. మీ ఆశీస్సులు పంపండి’’ అని అభిమానుల్ని కోరారు. దాంతో, నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వేరే రాష్ట్రంలో తన కొత్త సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడంతో శ్రీకాంత్ పెళ్లికి నాని హాజరుకాలేకపోయారని సమాచారం.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ ‘దసరా’తో డైరెక్టర్‌గా మారారు. నాని (nani), కీర్తిసురేశ్ (keerthy suresh), దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకిపైగా వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని సింగరేణి సమీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే కథ ఇది. ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేసిన ‘దసరా’ ప్రస్తుతం ఓటీటీ (ott) ‘నెట్‌ఫ్లిక్స్’ (netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు శ్రీకాంత్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు