Guntur Kaaram: అలా ‘గుంటూరు కారం’లో భాగమయ్యా.. మహేశ్‌కు అన్నీ తెలుసు: మనోజ్‌ పరమహంస

మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో తానెలా భాగస్వామి అయ్యారో డీవోపీ మనోజ్‌ పరమహంస ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Published : 27 Oct 2023 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఈ సినిమాకి ముందుగా పి. ఎస్‌. వినోద్‌ (PS Vinod) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. దాదాపు 50 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు. ఆ స్థానాన్ని మనోజ్‌ పరమహంస (Manoj Paramahamsa) భర్తీ చేశారు. తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో మనోజ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాటోగ్రఫీ విషయంలో మహేశ్‌ బాబుకు అన్నీ తెలుసని కొనియాడారు.

రివ్యూ: మాస్టర్‌పీస్‌.. నిత్యా మేనన్‌ నటించిన వెబ్‌సిరీస్‌ మెప్పించిందా?

‘‘నువ్వు అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్‌. మహేశ్‌ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు?’ అని నా స్నేహితులంతా అడిగేవారు. ‘గుంటూరు కారం’తో ఆ ప్రశ్నకు సమాధానం వచ్చినట్లే. కానీ, కెమెరా గురించి అన్ని విధాల తెలిసిన మహేశ్‌తో వర్క్‌ చేయడం సవాలే (నవ్వుతూ).  ‘గుంటూరు కారం’ నుంచి పి.ఎస్‌. వినోద్‌ వైదొలగడానికి గల కారణం నాకూ తెలియదు. నిఖిల్‌ హీరోగా నా మిత్రుడు భరత్‌ కృష్ణమాచారి ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘లియో’ తర్వాత నేను పనిచేయాల్సిన సినిమా అదే. అయితే, నాకు బాగా క్లోజ్‌ అయిన సంగీత దర్శకుడు తమన్‌ ఓ రోజు ఫోన్‌ చేసి ‘గుంటూరు కారం’ సినిమాకి పనిచేయాలన్నారు. నేను నా కమిట్‌మెంట్స్‌ గురించి చెబితే ‘అదంతా మేం చూసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. తప్పకుండా రావాలి’ అని అన్నారు. అలా ఇతర కమిట్‌మెంట్స్‌ను రీ షెడ్యూల్‌ చేసుకుని ఇందులో భాగమయ్యా’’ అని మనోజ్‌ తెలిపారు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. మనోజ్‌ పరమహంస గతంలో.. ‘ఏమాయ చేసావె’, ‘రేసుగుర్రం’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌ లీ’, ‘రాధేశ్యామ్‌’ తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని