Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. బయటకు వచ్చేసిన కథానాయిక..!

మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కనున్న చిత్రం ‘కన్నప్ప’ (kannappa) నుంచి నటి నుపుర్‌ సనన్‌ వైదొలిగారు.

Published : 21 Sep 2023 01:25 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు (manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కనున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ ప్రాజెక్టు నుంచి నటి నుపుర్‌ సనన్‌ (Nupur Sanon) పక్కకు తప్పుకొన్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్వీట్ చేశారు. ‘‘డేట్స్‌ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడం వల్ల నటి నుపుర్‌ సనన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారని ప్రకటించడం బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్‌ అవుతాం. అలాగే, కొత్త నటీమణి కోసం వెతుకులాట మొదలు పెట్టాం. నుపుర్‌ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఆసక్తికరమైన రోజులు రానున్నాయి. అప్‌డేట్స్‌ కోసం వేచి చూడండి’’ అని ఆయన పేర్కొన్నారు.

Gandeevadhari Arjuna: ఓటీటీలోకి ‘గాండీవధారి అర్జున’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని ఆగస్టులో పట్టాలెక్కించారు. ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందించనున్నారు. ఇక, ఈ సినిమాలో ఎంతో కీలకమైన శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారంటూ ఇటీవల ప్రచారం సాగింది. నటి కృతిసనన్‌ సోదరిగా నుపుర్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆమె ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో యాక్ట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని