Gandeevadhari Arjuna: ఓటీటీలోకి ‘గాండీవధారి అర్జున’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌ ‘గాండీవధారి అర్జున’ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published : 20 Sep 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 24 (Gaandeevadhari Arjuna OTT Release Date) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ విడుదల చేసింది. ‘సెప్టెంబరు 24న రానున్నది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్‌ తెచ్చే ధైర్యం కూడా’ అని పేర్కొంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా లండన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌ బాడీగార్డ్‌గా కనిపిస్తారు. ఆయన సరసన సాక్షి వైద్య (Sakshi Vaidya) నటించింది. నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 25న బాక్సాఫీసు ముందుకొచ్చి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్‌ నాకు తెలుసు: ‘7/జీ బృందావన కాలనీ’ ఫేమ్‌ రవికృష్ణ

క‌థేంటంటే: అర్జున్ (వ‌రుణ్‌ తేజ్‌) సోల్జ‌ర్‌గా ప‌నిచేసిన ఓ యువ‌కుడు. ఓ ఏజెన్సీ త‌ర‌ఫున యూకేలో బాడీగార్డ్‌గా చేరతాడు. జీ-20 సదస్సు కోసం యూకే వెళ్లిన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బ‌హ‌దూర్ (నాజ‌ర్‌) ప్రాణ ర‌క్ష‌ణ కోసం రంగంలోకి దిగుతాడు. దేశం కాని దేశంలో ఆదిత్య‌రాజ్‌ని అంతం చేయాలనే కుట్ర వెన‌క ఎవ‌రున్నారు? అందుకు కార‌ణాలేంటి? అత్యంత ప్ర‌మాదంలో ఉన్న ఆయ‌న ప్రాణాల్ని అర్జున్ కాపాడాడా? లేదా? కేంద్ర‌మంత్రికి ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ అయిన ఐఏఎస్ ఐరా (సాక్షి వైద్య‌)కి, అర్జున్‌కి మ‌ధ్య సంబంధం ఏంటి? ఈ క‌థ‌లో సీ అండ్ జీ కంపెనీ అధినేత ర‌ణ్‌వీర్ (విన‌య్ రాయ్‌) పాత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Gaandeevadhari Arjuna On Netflix).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని