Dulquer Salmaan: మమ్ముట్టి బర్త్‌డే.. దుల్కర్‌ సల్మాన్‌ ఎమోషనల్‌ నోట్‌

మమ్ముట్టి (Mammootty) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు హీరో దుల్కర్‌ సల్మాన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 07 Sep 2023 17:48 IST

హైదరాబాద్‌: ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా విషెస్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ఓ ఎమోషనల్ నోట్‌ రాశాడు. ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూల్లో తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచిన దుల్కర్‌.. తాజాగా మరోసారి ఆయనంటే తనకెంత ఇష్టమో రాసుకొచ్చారు.

‘నేను చిన్నతనంలో ఉన్నప్పుడు పెద్దయ్యాక నీలాంటి వ్యక్తిగా మారాలనుకున్నా. నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు నీలాంటి గొప్ప నటుడిని కావాలనుకున్నా. ఇక నేను నాన్న అయ్యాక.. నువ్వు ఓ తండ్రిగా నాకోసం ఏదైతే చేశావో అవన్నీ చేయాలనుకున్నా. కానీ, ఏదో ఓ రోజు నువ్వు సాధించిన దానిలో సగం సాధించినా చాలనుకుంటున్నా నాన్న. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ఇలాగే ప్రపంచం మొత్తానికీ వినోదాన్ని పంచుతూ ఎంతోమందికి స్ఫూర్తినివ్వండి’ అంటూ మమ్ముట్టితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టుకు అభిమానులతో పాటు నటీనటులంతా (#HappyBirthdayMammootty) కామెంట్స్‌ చేస్తున్నారు. 

‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’లో బాలకృష్ణ..?

ఇక మరోవైపు మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా విడుదలవుతున్నాయి. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ‘భ్రమయుగం’ (Bramayugam) అని ఓ కొత్త  చిత్రాన్ని  ప్రకటించారు. దీని ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. మమ్ముట్టి భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్న ఆ పోస్టర్‌ ప్రస్తుతం నెటిజన్లును ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని