Miss Shetty Mr Polishetty: ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’లో బాలకృష్ణ..?

అనుష్క శెట్టి (Anushka Shetty) - నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). గురువారం ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Updated : 07 Sep 2023 19:32 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty).. యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). మహేశ్‌బాబు అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్తతరం ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క - నవీన్‌ జోడీ, కామెడీ టైమింగ్‌, ఎమోషన్స్‌.. ఇలా సినిమా తమకెంతో నచ్చిందంటూ సినీ ప్రియులు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు.

Jawan Movie Review | రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో నటుడు బాలకృష్ణ కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, ఆయన అతిథి పాత్రలో నటించలేదు. కానీ, ఇందులో బాలకృష్ణ నటించిన పలు చిత్రాలను రిఫరెన్స్‌గా చూపించారు. అనుష్క - జయసుధలపై చిత్రీకరించిన ఓ సన్నివేశంలో ‘జై బాలయ్య.. జై జై బాలయ్య.. మన బాలయ్య.. ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ బాలయ్య ఈజ్‌ ది బెస్ట్‌’ అంటూ జయసుధ చెప్పే స్లోగన్స్‌ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయి. ఓ సన్నివేశంలో ‘అఖండ’ ఎంట్రీ సీన్స్‌ను చూపించారు. ఇక, ఈ సీన్స్‌ వచ్చినప్పుడు సినీ ప్రియులు సైతం ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తున్నారని నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు.

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటించిన చిత్రమిది. ఇందులో ఆమె చెఫ్‌ పాత్రలో కనిపించారు. మరోవైపు, ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌ పొలిశెట్టి ఈ సినిమాలోనే నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని