Dulquer: దుల్కర్‌ మొదట అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా...!

‘మహానటి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో దుల్కర్‌ సల్మాన్‌. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ మలయాళ హీరో ఏ వయసులో పారితోషికం తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Published : 27 Sep 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘మహానటి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో దుల్కర్‌ సల్మాన్‌. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ మలయాళ హీరో ఏ వయసులో పారితోషికం తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్‌ పలు విషయాలను పంచుకున్నాడు. తను తీసుకున్న మొదటి పారితోషికం 2000 రూపాయలని తెలిపాడు. అది తనకు రెండు కోట్లతో సమానమన్నారు.

‘నాకు 10ఏళ్లు ఉన్నప్పుడు రాజీవ్‌ మేనన్‌ యాడ్‌ ఏజన్సీ వాళ్లు మా స్కూల్‌కు వచ్చారు. ఒక యాడ్‌ కోసం కొంతమందిని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన వాళ్లలో నేను ఉన్నాను. వాళ్లు నాకు 2000 రూపాయలు ఇచ్చారు.  అది నాకు రెండు కోట్లతో సమానం. ఆ డబ్బుల్లో నేను 500రూపాయలు మా అమ్మమ్మ, తాతయ్యలకు ఇచ్చాను. మిగతావి మా అమ్మకు ఇచ్చాను. అప్పటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా మా అమ్మని ఆ డబ్బులతో కొనిపెట్టమనే వాడిని. మా అమ్మ నువ్వు ఆ డబ్బులు ఎప్పుడో ఖర్చుపెట్టుకున్నావని సరదాగా చెప్పేది’అంటూ దుల్కర్‌ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని