LYCA Productions: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ED) అధికారులు నేడు లైకా సంస్థలో సోదాలు చేపట్టారు.
చెన్నై: ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దాడులు చేపట్టింది. చెన్నై (Chennai)లోని లైకా కార్యాలయం సహా ఆ సంస్థకు చెందిన మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఓ కేసులో ఈడీ (ED) అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల నుంచి లైకా సంస్థ ఎటువంటి ప్రకటనలు చేయలేదు.
బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన పొన్నియన్ సెల్వన్ 1, 2 (Ponniyin Selvan 1 and 2) చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన విషయం తెలిసిందే. వీటితో పాటు కత్తి, రోబో 2.0, దర్బార్ తదితర చిత్రాలు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి. ఈ సంస్థ నిర్మిస్తున్న ఇండియన్ 2, లాల్ సలామ్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం