
F3 Telugu Movie Review: రివ్యూ: ఎఫ్3
F3 Telugu Movie Review; చిత్రం: ఎఫ్3; తారాగణం: వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సునీల్, అలీ, ప్రగతి, అన్నపూర్ణ, విజయ, రఘుబాబు, తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీ రామ్; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: దిల్‌రాజు, శిరీష్; నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్; కథ, కథనం, దర్శకత్వం: అనిల్ రావిపూడి; విడుదల తేదీ: 27-05-2022
ఫన్.. ఫ్రస్ట్రేషన్ అంటూ ‘ఎఫ్2’తో కడుపుబ్బా నవ్వించారు వెంకటేష్, వరుణ్‌తేజ్. ‘ఎఫ్2’కి ఫ్రాంచైజీగా రూపొందిన చిత్రమే ‘ఎఫ్3’. హిందీలో ‘గోల్‌మాల్’ సినిమాలు రూపొందాయి కానీ... తెలుగుకి మాత్రం ఫ్రాంచైజీ సినిమాలు కొత్తే. తొలి సినిమాలోని పాత్రలతోనే రూపొందిన సినిమా ఇది. మోర్ ఫన్ అంటూ ఈ చిత్రం పట్టాలెక్కడంతోనే అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. హాస్య ప్రధానమైన సినిమాలు అరుదుగా వస్తున్న ఈ దశలో ‘ఎఫ్3’ ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించింది. మరి అందుకు తగ్గట్టే సినిమా ఉందా? ఈసారి వెంకటేష్, వరుణ్‌తేజ్ పడిన కష్టాలేంటి? వారిద్దరూ కలిసి ఎలా నవ్వించారు?
కథేంటంటే: వెంకీ (వెంకటేష్)కి ఇంటి నిండా సమస్యలే. సవతి తల్లి పోరు ఒక పక్క... సమస్యలు మరో పక్క... వాటి నుంచి బయట పడేందుకు అడ్డదారుల్లో సంపాదనపై దృష్టిపెడతాడు. వరుణ్ (వరుణ్‌తేజ్) ఖరీదైన కలలు కనే యువకుడు. కానీ చేతిలో మాత్రం చిల్లిగవ్వ ఉండదు. అతను ఎలాగైనా ధనవంతులైన కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమలో పడేసి ఆమెని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటాడు. హనీ (మెహ్రీన్) కూడా తన కుటుంబం సమస్యల నుంచి గట్టెక్కాలంటే ధనికుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే మార్గం అనుకుంటుంది. అలా వరుణ్, హనీ ధనవంతుల పిల్లలుగా నటిస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు. వరుణ్ డబ్బున్నవాడిగా కనిపించేందుకని వెంకీ తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడి పెడతాడు. కానీ, వాళ్లందరి అసలు రంగు తొందరలోనే బయట పడుతుంది. ఒకరినొకరు మోసం చేసుకున్నామని అర్థమవుతుంది. సమస్యల నుంచి గట్టెక్కకపోగా అందరూ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న దశలో... ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ ప్రసాద్ (మురళీశర్మ) గురించి తెలుస్తుంది. చిన్నప్పుడే తన నుంచి దూరమైన వారసుడి కోసం వెతుకుతున్న ఆయన ఇంటికి వరుస కడుతుంది వెంకీ, వరుణ్ బ్యాచ్. మీ వారసుడిని నేనంటే నేనంటూ పోటీ పడతారు. మరి ఆనంద్‌ప్రసాద్ తన వారసుడిగా ఎవరిని స్వీకరించారు.. వీళ్లందరూ డబ్బు సమస్యల నుంచి ఎలా గట్టెక్కారనేదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే: లాజిక్ అనీ... రియలిస్టిక్ అనీ మమ్మల్ని ఎంతకాలం దూరం పెడతారంటూ ఒకప్పటి తెలుగు సినిమా స్టైల్ పోలీస్ అధికారిగా తనికెళ్ల భరణి క్లైమాక్స్‌లో వచ్చి ఏకరువు పెడతాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అరిగిపోయిన డైలాగ్ చెప్పి నవ్వులు పూయిస్తాడు. అచ్చం ఈ డైలాగ్‌కి తగ్గట్టుగానే... ఇప్పుడొస్తున్న రియలిస్టిక్ కథల మధ్య లాజిక్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీసినట్టున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కొంతకాలంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న భారీదనం, యాక్షన్ సినిమాల మధ్య ఆహ్లాదంగా సాగుతూ వినోదాన్ని పంచుతుందీ చిత్రం. కాకపోతే ఈ సినిమా చూస్తున్నప్పుడు లాజిక్ లెక్కలకి దూరంగా ఉండాల్సిందే. ఇలా ఎలా సాధ్యం? అనే ప్రశ్న మొదలైతే మాత్రం ఈ సినిమాని ఆస్వాదించలేరు. ఆ లెక్కలకి దూరంగా పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తే మాత్రం ‘ఎఫ్2’ని మించి వినోదాన్ని ఆస్వాదించొచ్చు. డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. పాత్రలన్నీ అత్యాశతో వ్యవహరిస్తుంటాయి. అందుకోసం అడ్డదారులు తొక్కుతుంటాయి. ఆ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. తనకున్న రేచీకటి సమస్యని కప్పి పుచ్చుకునేందుకు వెంకటేష్ పడే పాట్లు ప్రథమార్ధానికి హైలైట్. వెంకట్రావు పెళ్లాన్ని చూశా... అంటూ ఆయన చెప్పే డైలాగ్ ప్రతిసారీ నవ్వించింది.
నత్తితో బాధపడుతూ వరుణ్‌తేజ్ రకరకాల మేనరిజమ్స్‌ని ప్రదర్శించిన తీరు చాలా బాగుంటుంది. పాత సినిమాల పాటల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ నవ్వించిన తీరు కూడా చాలా బాగుంటుంది. ద్వితీయార్ధం కథంతా ఆనంద్‌ప్రసాద్ ఇంటికి మారుతుంది. వారసులం మేమంటే మేమంటూ తమన్నాతో సహా పోటీపడటం, వాళ్లకి రకరకాల పరీక్షలు పెట్టడం ఆ నేపథ్యంలో పండే వినోదంతో సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. ‘ఎఫ్ 3’ టాయ్స్ అంటూ స్టార్ కథానాయకుల్ని చూపించడం, పతాక సన్నివేశాల్లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో ఫైట్లు చేయించిన తీరు పైసా వసూల్ సూత్రానికి తగ్గట్టుగా ఉంటాయి. బోలెడంత మంది నటులు తెరపై కనిపిస్తుండగా సాగే ఆ సన్నివేశాలు ఈవీవీ సినిమాల్ని గుర్తు చేస్తాయి. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి ఆస్వాదించే చిత్రం ‘ఎఫ్3’.
ఎవరెలా చేశారంటే: ‘ఎఫ్2’లో కో బ్రదర్స్‌గా హుషారుగా కనిపించి, మంచి టైమింగ్‌ని ప్రదర్శించిన వెంకటేష్, వరుణ్‌తేజ్ ఇందులో మరింతగా సందడి చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, టైమింగ్, డైలాగ్ డెలవరీ ఆకట్టుకున్నాయి. వెంకటేష్ తన ఇమేజ్‌ని పక్కనపెట్టి, రేచీకటి బాధితుడిగా నవ్వించిన తీరు బాగుంది. వరుణ్‌తేజ్ కూడా అవలీలగా కామెడీ పండించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాత్రలో ఒదిగిపోయాడు. రాజేంద్రప్రసాద్, రఘుబాబు, సునీల్, అలీ, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై.విజయ... ఇలా తెరనిండా పాత్రలే కనిపిస్తాయి. ద్వితీయార్ధంలో ఆ మోతాదు మరింతగా పెరుగుతుంది. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ అల్లరి ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం సినిమాపై ప్రభావం చూపించాయి. పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. పూజాహెగ్డేపై చిత్రీకరించిన పాట కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబమంతా కలిసి చూసేలా స్వచ్ఛమైన కామెడీతో రచన చేశారు. ఆద్యంతం నవ్వించేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఇంత మంది నటులతో సినిమాని నిర్మించడం విశేషమే.
బలాలు
+ హాస్యం
+ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల నటన
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
- తెలిసిన కథే
- లాజిక్ లేని సన్నివేశాలు
చివరిగా: ‘ఎఫ్3’.. నవ్వుల ట్రిపుల్ ధమాకా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబువుతోన్న గోల్కొండ కోట
-
Politics News
Eatala Jamuna: మేం కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: ఈటల జమున
-
World News
WHO: మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు..!
-
Business News
Lenskart: ఆసియా మార్కెట్‌పై లెన్స్‌కార్ట్ కన్ను.. జపాన్ కంపెనీలో మెజార్టీ వాటా!
-
Movies News
Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?