Gangleader: మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. బాస్ మూవీ రీరిలీజ్ వాయిదా..!
టాలీవుడ్(Tollywood)లో కొంతకాలం నుంచి రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, ప్రభాస్ చిత్రాలు విడుదల కాగా.. ఇప్పుడు మెగాస్టార్ ‘గ్యాంగ్‌లీడర్’ రీరిలీజ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మెగా అభిమానులకు నిరాశ ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఒకప్పటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘గ్యాంగ్‌లీడర్’ (GangLeader) రీరిలీజ్ వాయిదా పడింది. నేటి సాంకేతికకు అనుగుణంగా 4కే వెర్షన్‌లోకి ‘గ్యాంగ్‌లీడర్’ను సిద్ధం చేయగా.. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో చిత్రబృందం అసంతృప్తిగా ఉందని.. అందుకే ఈ సినిమా రీరిలీజ్ వాయిదా పడిందని సినీ ప్రియులు అనుకుంటున్నారు. ఈ వార్తలపై మెగా అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా దీన్ని రీరిలీజ్ చేయాలని కోరుతున్నారు.
చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘గ్యాంగ్‌లీడర్’ (Gangleader) కూడా ఒకటి. సుప్రీమ్ హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చిన సినిమాల్లో ఇది కూడా ఉంది. మాస్, కమర్షియల్ హంగులతో విజయ బాపినీడు దీన్ని తెరకెక్కించారు. ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై ఈ ఏడాదితో సుమారు 32 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం దీన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 11న ఈసినిమా రీరిలీజ్ ముహూర్తం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇది వాయిదా పడినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
-
Crime News
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్