మమ్ముట్టి స్కూల్‌ డేస్‌లో ఏం జరిగింది..?

దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. ఆయన నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్ ‌18’. శంకర్‌రామకృష్ణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Published : 06 Feb 2021 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. ఆయన నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్ ‌18’. శంకర్‌ రామకృష్ణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను అక్కినేని హీరో సుమంత్‌ విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర విద్యాలయ పతాకంపై వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. ఏ.హెచ్‌.కాషిఫ్‌ సంగీతం అందించారు.

రెండు పాఠశాలలు.. అందులో ఒకటి ప్రభుత్వ పాఠశాల, మరొకటి ప్రైవేటుది. ఆ స్కూళ్లలో అండర్‌ వరల్డ్‌ గ్రూపులుగా మారిన విద్యార్థులు. ఆ గ్రూపుల మధ్య జరిగే గొడవలు, మరోవైపు ప్రేమకథ.. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే.. నా స్కూల్‌డేస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఈ చిత్రంలో ఆ రెండు పాఠశాలల విద్యార్థులతో హీరో మమ్ముట్టికి సంబంధం ఏంటి..? అనే ఆసక్తి రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది. ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి మరి..

 ఇదీ చదవండి..

అల్లు అర్జున్‌ కారవాన్‌కు ప్రమాదం
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని