అభిరామ్‌ ప్రయాణం...థ్యాంక్‌ యూ

తనని తాను సరి చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన ప్రయాణం ఎలాంటిదో తెలియాలంటే ‘థ్యాంక్‌ యూ’ చూడాల్సిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాశిఖన్నా, మాళవిక నాయర్‌, అవికాగోర్‌ కథానాయికలు. విక్రమ్‌

Published : 26 May 2022 02:07 IST

నని తాను సరి చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన ప్రయాణం ఎలాంటిదో తెలియాలంటే ‘థ్యాంక్‌ యూ’ చూడాల్సిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాశిఖన్నా, మాళవిక నాయర్‌, అవికాగోర్‌ కథానాయికలు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. జులై 8న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. వ్యాపారవేత్త అభిరామ్‌గా నాగచైతన్య కనిపించారు. ‘నీ లైఫ్‌లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’.. ‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు’ అనే సంభాషణలు టీజర్‌లో వినిపిస్తాయి. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదిగిన వ్యక్తి ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి కథ: బి.వి.ఎస్‌.రవి, సంగీతం: తమన్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని