Liger: తేనె కళ్ల పిల్లగాడి.. లవ్వాట

‘లైగర్‌’ ప్రచార హంగామా కొనసాగుతోంది. ఈ సినిమాలోని మరో పాటని శనివారం విడుదల చేశారు. ‘తేనెకళ్లతోటి పిల్లగాడు పట్టేసిండే...’ అంటూ మొదలయ్యే ఈ రొమాంటిక్‌ గీతాన్ని తనిష్క్‌ బాగ్చీ స్వరపరిచారు. భాస్కరభట్ల రవికుమార్‌ రచించగా,

Updated : 07 Aug 2022 03:26 IST

‘లైగర్‌’ ప్రచార హంగామా కొనసాగుతోంది. ఈ సినిమాలోని మరో పాటని శనివారం విడుదల చేశారు. ‘తేనెకళ్లతోటి పిల్లగాడు పట్టేసిండే...’ అంటూ మొదలయ్యే ఈ రొమాంటిక్‌ గీతాన్ని తనిష్క్‌ బాగ్చీ స్వరపరిచారు. భాస్కరభట్ల రవికుమార్‌ రచించగా, సింహా, శ్రావణభార్గవి ఆలపించారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్‌’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అనన్యపాండే కథానాయిక. బాక్సింగ్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాని పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మించారు. మైక్‌ టైసన్‌ ముఖ్య పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని