అందరూ మెచ్చే రామన్న యూత్‌

అభయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్‌’. ఫైర్‌ ప్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 13 Sep 2023 03:57 IST

భయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్‌’. ఫైర్‌ ప్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది. అనిల్‌ గీల, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నటులు విష్వక్‌ సేన్‌, ప్రియదర్శి, తిరువీర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టామనేది చూస్తుంటారు. కానీ, ఆ సినిమా వెనక పనిచేస్తున్న ప్రతిభావంతులే దానికి అసలైన బలమని నమ్ముతా. ఈ చిత్రానికి అలాంటి మ్యాజిక్‌ వర్కవుట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. క్రికెట్‌, రాజకీయ పరిజ్ఞానం గ్రామీణ యువతకే ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లేవర్‌ని ఈ సినిమాలోకి తీసుకొచ్చాడు అభయ్‌. చాలా ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ ఇస్తే నిర్మాత చదవలేదు. మొత్తం చిత్రం పూర్తయ్యాక తెరపై చూశారు. ప్రేక్షకులు చిన్న సినిమా.. పెద్ద సినిమా అనేది చూడరు. మంచి కథ ఉంటే తప్పకుండా ఏ చిత్రమైనా చూస్తారు. ఈ నెల 15 నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆ రోజును మా నాన్నకు అంకితమిస్తా’’ అన్నారు నటుడు, దర్శకుడు అభయ్‌. ఈ కార్యక్రమంలో అమూల్య రెడ్డి, శివ, యాదమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని