‘తలకోన’లో సాహసాలు

అప్సరారాణి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘తలకోన’. నగేశ్‌ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 27 Oct 2023 01:52 IST

అప్సరారాణి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘తలకోన’. నగేశ్‌ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. దేవర శ్రీధర్‌రెడ్డి నిర్మాత. నవంబరు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో   విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు ముఖ్య అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నాయికా ప్రధానంగా సాగే ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. పూర్తిగా అడవిలో చిత్రీకరణ చేశాం. థ్రిల్లర్‌ కథే అయినా... ఇంటిల్లిపాదినీ మెప్పించే అంశాలుంటాయి. కథని ప్రకృతితో       ముడిపెట్టిన తీరు ప్రేక్షకుల్ని   కట్టిపడేస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ కథ చెప్పగానే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఎన్నో సవాళ్లు, సాహసాల మధ్య అడవుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. నవంబరులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. కథానాయిక అప్సరారాణి మాట్లాడుతూ ‘‘కెరీర్‌   ఆరంభంలోనే ఇలాంటి సాహసోపేతమైన యాక్షన్‌ కథలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించా. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తా. మంచి కథ, కథనాలతో వస్తున్న ఈ చిత్రం విజయంతో మా అందరికీ మంచి పేరుని తీసుకొస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్‌ ఘోష్‌తోపాటు చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు