Tamannaah: రెండు కోణాల్లో తమన్నా?

ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే.

Updated : 17 Apr 2024 12:03 IST

‘ఎం.ఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే. ‘ది ఫ్రీలాన్సర్‌’ లాంటి సిరీస్‌లతో ఓటీటీలోనూ తన సత్తా చాటారు. ఇప్పుడీయన సిద్ధం చేస్తున్న మరో ఓటీటీ కథలో అగ్రకథానాయిక తమన్నా కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబయిలో జరిగిన ఓ క్రైమ్‌ కేసు నేపథ్యంలో ఆ ప్రాజెక్టు తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమన్నాతో పాటు ఈ సినిమాలో టీవీ నటి రిద్దిమా పండిత్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘మునుపెన్నడూ చేయని పాత్రలో తమన్నా కనిపించనుంది. రెండు విభిన్న కోణాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సమాయత్తమవుతోందామె. రెండు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకునే సంఘటనలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుంద’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘ఓదెల 2’ చిత్రీకరణతో బిజీగా ఉంది తమన్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని