MAD Square: రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్‌ స్క్వేర్‌’

‘టిల్లు స్క్వేర్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది.

Updated : 20 Apr 2024 12:14 IST

‘టిల్లు స్క్వేర్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. గతేడాది అక్టోబరులో విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కి కొనసాగింపుగా, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ పేరుతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. తొలి  సినిమాలో నటించిన నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ కథానాయకులు. నాయికల వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.  తొలి సినిమా ‘మ్యాడ్‌’ ఎంతగా నవ్వులు పంచిందో, అందుకు రెట్టింపు స్థాయిలో నవ్వించడమే లక్ష్యంగా రూపొందిస్తున్న చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: షామ్‌దత్‌, కూర్పు: నవీన్‌ నూలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని