TFA: డైరెక్టర్స్‌ డేని ఘనంగా నిర్వహిస్తాం

‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్‌ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు.

Updated : 23 Apr 2024 09:47 IST

‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్‌ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన పేరు మీదే  డైరెక్టర్స్‌ డే చేయాలనుకున్నాం. అందరి సహకారంతో ఐదేళ్లుగా జరుపుతున్నాం. ఈసారి నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో పరిశ్రమనంతా కలుపుకుని ఆ  వేడుకల్ని నిర్వహిస్తున్నాం’’ అన్నారు తెలుగు సినిమా దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, ప్రస్తుత అధ్యక్షుడు వీరశంకర్‌. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్‌.బి.స్టేడియంలో డైరెక్టర్స్‌ డే వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకకి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. పలువురు దర్శకులు ఇందులో పాల్గొన్నారు. సీనియర్‌ దర్శకులు విజయేంద్రప్రసాద్‌ చేతులమీదుగా టీఎఫ్‌డీఎ.ఇన్‌ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు.

ప్రభాస్‌ విరాళం రూ.35 లక్షలు: దర్శకుల సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ రూ.35 లక్షలు విరాళం ప్రకటించినట్టు తెలిపారు దర్శకుడు మారుతి. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, హరీశ్‌శంకర్‌, రామ్‌ప్రసాద్‌, వి.ఎన్‌.ఆదిత్య, రాజా వన్నెంరెడ్డి, సముద్ర, దశరథ్‌తోపాటు పలువురు యువ దర్శకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని