బన్నీ డ్యాన్స్‌ అంటే ఇష్టం: షాహిద్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అన్నారు. ‘కబీర్‌సింగ్‌’ చిత్రంతో సెన్సేషనల్‌ హిట్‌ను సొంతం చేసుకున్న షాహిద్‌ ప్రస్తుతం ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నారు. మాతృకను రూపొందించిన...

Published : 13 May 2020 17:17 IST

ఆయనతో స్ర్కీన్‌ పంచుకోవడం భయంగా అనిపించింది..!

ముంబయి: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ అన్నారు. ‘కబీర్‌సింగ్‌’ చిత్రంతో సెన్సేషనల్‌ హిట్‌ను సొంతం చేసుకున్న షాహిద్‌ ప్రస్తుతం ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నారు. మాతృకను రూపొందించిన గౌతమ్‌ తిన్ననూరినే రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో షాహిద్‌ తండ్రి పంకజ్‌ కపూర్‌ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడడంతో తాజాగా షాహిద్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

షాహిద్‌.. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు?

షాహిద్‌: దేవుడి దయ వల్ల మేమంతా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనే ఆశిస్తున్నాను.

మీరు కథానాయకుడిగా నటించిన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రానికి ఎలాంటి అవార్డులు రాకపోవడం పట్ల నిరుత్సాహానికి గురయ్యారా? ఆ సమయంలో అవార్డుల కాంట్రవర్సీ కూడా జరిగింది కదా?

షాహిద్‌: ఆ కాంట్రవర్సీలను పక్కన పెడితే.. మీరు నాపై చూపిస్తున్న  ప్రేమాభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ప్రేమాభిమానాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. 

కోహ్లీ గురించి ఏమైనా చెప్పగలరు?

షాహిద్‌: కోహ్లీ న్యూలుక్‌ నాకు బాగా నచ్చింది

ప్రస్తుతం ఓటీటీలో మీరు ఏం చూస్తున్నారు?

షాహిద్‌: ఫ్యామిలీ మ్యాన్‌.. నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను

‘జెర్సీ’ సినిమా కోసం మీ తండ్రి పంకజ్‌ కపూర్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

షాహిద్‌: ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం.. ఇప్పటికీ భయంగా అనిపిస్తుంది. 

లాక్‌డౌన్‌లో కూడా పాజిటివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

షాహిద్‌: రోజువారీ దినచర్యకు సంబంధించి షెడ్యూల్‌ వేసుకోండి. కొన్ని గోల్స్‌ పెట్టుకోండి. ఆ గోల్స్‌ను సాధించడానికి కావాల్సిన వర్క్‌ చేయండి. ఫ్యామిలీతో టైమ్‌ గడపండి. అన్నింటికంటే ఇది చాలా గొప్పది. ముఖ్యమైనది. 

‘కబీర్‌ సింగ్‌’ చిత్రం తర్వాత మీరు ప్రస్తుతం చేస్తున్న ‘జెర్సీ’ సినిమాపై మాకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాబట్టి ‘జెర్సీ’ సినిమా గురించి ఏమైనా ఆసక్తికర విషయాలను చెప్పగలరు?

షాహిద్‌: ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడం కోసం మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకూ చిత్రీకరించిన దాని విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. 

స్కూల్‌ డేస్‌లో ఉన్నప్పుడు మీకు గణితం అంటే ఇష్టమేనా?

షాహిద్‌: నాకస్సలు ఇష్టం లేదు

ఫుట్‌బాల్‌ లేదా క్రికెట్‌ ఏది ఎక్కువ ఇష్టం?

షాహిద్‌: క్రికెట్‌

అల్లు అర్జున్‌ గురించి ఒక్కమాటలో చెప్పగలరు?

షాహిద్‌: ఆయన డ్యాన్స్‌ చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని