Rajamouli: ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సత్తా చాటారు.

Updated : 14 Apr 2023 08:00 IST

‘టైమ్‌’ 100 మంది ప్రభావశీలుర జాబితాలో చోటు

న్యూయార్క్‌: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సత్తా చాటారు. 2023కుగానూ ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌, రచయిత సల్మాన్‌ రష్దీ, బుల్లితెర ప్రయోక్త, న్యాయనిర్ణేత పద్మాలక్ష్మి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్‌, ప్రఖ్యాత గాయని బియాన్స్‌ తదితరులు కూడా ఈ జాబితాలో నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించిన ప్రముఖ నటి ఆలియా భట్‌ రాజమౌళి గురించి టైమ్‌ మేగజీన్‌లో ప్రొఫైల్‌ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని