Hansika: సంగీత్‌ కోసం సిద్ధమవుతోన్న హన్సిక కుటుంబసభ్యులు

మరి కొన్నిరోజుల్లో సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ చెప్పనున్నారు నటి హన్సిక. తన స్నేహితుడు సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే.

Published : 28 Nov 2022 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి హన్సిక ఇంట పెళ్లి పనులు సందడిగా కొనసాగుతున్నాయి. ‘మాతా కీ చౌకీ’తో పెళ్లి పనులు మొదలుపెట్టిన కుటుంబసభ్యులు ఇప్పుడు సంగీత్‌ కోసం సిద్ధమవుతున్నారు. వీకెండ్‌ కావడంతో ఆదివారం ఇంటికే పరిమితమైన వారు డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను హన్సిక ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. మరోవైపు, తన స్నేహితులందరికీ ఆమె బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది. గ్రీస్‌లో జరిగిన ఈ పార్టీలో తన స్నేహితులతో కలిసి ఆమె ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. కూల్‌ డ్రింక్‌ చేత పట్టుకుని అక్కడి వీధుల్లో తిరుగుతూ నవ్వులు పూయించింది. అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను హన్సిక పెళ్లి చేసుకోనున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో డిసెంబర్‌ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌ జైపుర్‌లోని ఓ రాజకోట వీరి వివాహ వేదిక కానుంది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని