Kanguva: యోధుడిగా సూర్య.. ‘కంగువ’ ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా?

సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘కంగువ’  (Kanguva). స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Published : 23 Jul 2023 01:02 IST

హైదరాబాద్‌:  సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘కంగువ’  (Kanguva). స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో సూర్య కనిపించారు.  కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అని అర్థం. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నారు. పోరాట ఘట్టాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని