
Hero: ‘హీరో’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: 2022 సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘హీరో’. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయమైన సినిమా ఇది. నిధి అగర్వాల్ కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ యాక్షన్ కామెడీ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
కథేంటంటే: సినిమా హీరో కావాలని కలలు కనే ఓ మధ్య తరగతి యువకుడు అర్జున్ (అశోక్ గల్లా). పక్కింటి అమ్మాయి సుబ్బు (నిధి అగర్వాల్) ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో అర్జున్‌కి ఓ కొరియర్ అందుతుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ముంబయి మాఫియాకి చెందిన గన్ అది. ఆ తర్వాత మరో కొరియర్‌లో చంపమని చెబుతూ ఓ ఫొటో అందుతుంది. ఆ గన్, ఫొటోని అర్జున్‌కి పంపడానికి కారణమేంటి? ఇంతకీ ఆ ఫొటోలో ఎవరున్నారు? ముంబయి మాఫియాకీ, అర్జున్‌కీ సంబంధమేంటి? అర్జున్ హీరో అయ్యాడా? సుబ్బుని పెళ్లి చేసుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: తెలంగాణలో భాజపాకు బిగ్ షాక్... తెరాసలో చేరిన కార్పొరేటర్లు
-
Sports News
Ind vs Eng: టీమ్ఇండియా కెప్టెన్‌గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
-
Business News
Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
-
General News
PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
-
World News
Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?