Hrithik Roshan: ఆ సినిమా చేస్తున్నప్పుడు చనిపోతాననుకున్నా: హృతిక్‌ రోషన్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు హృతిక్‌ రోషన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ క్రిస్‌ గెతిన్‌తో ముచ్చటించారు. ‘వార్‌’ సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Published : 05 Jan 2023 01:20 IST

ముంబయి: తాను గతంలో నటించిన ‘వార్‌’ (War) సినిమాకు శారీరకంగా చాలా కష్టపడటంతో డిప్రెషన్‌కు గురైనంత పనైందని, ఒకానొక సమయంలో చనిపోతాననుకున్నాని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) అన్నారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ క్రిస్‌ గెతిన్‌ చేసిన ఇంటర్వ్యూ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఆ సినిమా కోసం అప్పుడు నేను సిద్ధంగా లేను. పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం నాకో సవాల్‌గా అనిపించింది. పర్‌ఫెక్షన్‌ కోసం ఎంతగానో ప్రయత్నించా. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేనాటికి తీవ్రంగా అలసిపోయా. 3- 4 వరకు ఎలాంటి శిక్షణా తీసుకోలేకపోయా. డిప్రెషన్‌ అంచులకు వెళ్లొచ్చా. నా జీవితంలో మార్పు అవసరమని అప్పుడే అనుకున్నా’’ అని హృతిక్‌ వివరించారు. అనంతరం, హృతిక్‌కు ఇచ్చిన శిక్షణను గెతిన్‌ గుర్తు చేసుకున్నారు. 2013లో తన దగ్గర శిక్షణ తీసుకున్న 7 నెలల్లో ఏ ఒక్కరోజూ హృతిక్‌ విరామం తీసుకోలేదన్నారు. 

దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ‘వార్‌’లో హృతిక్‌తోపాటు టైగర్‌ ష్రాఫ్‌ కీలక పాత్ర పోషించారు. వాణీ కపూర్‌ కథానాయిక. ఈ సినిమా 2019 అక్టోబరు 2న విడుదలైంది. ఇందులో హృతిక్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఆ తర్వాత హృతిక్‌ నటించిన చిత్రం ‘విక్రమ్‌ వేద’. ఇది గతేడాది సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆయన ‘ఫైటర్‌’లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని