మనసు దోచిన మగువలు వీళ్లే.. టాప్‌లో శ్రుతి

‘హైదరాబాద్‌ టైమ్స్‌’ ఏటా ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ (ఎక్కువ మంది ఇష్టపడే) మగువల జాబితా విడుదలైంది. ఈ లిస్టులో అగ్రస్థానాన్ని కమల్‌ హాసన్‌ తనయ శ్రుతి హాసన్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో...

Published : 04 Jun 2021 01:03 IST

‘హైదరాబాద్‌ టైమ్స్‌’ ఏటా ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ (ఎక్కువ మంది ఇష్టపడే) మగువల జాబితా విడుదలైంది. ఈ లిస్టులో అగ్రస్థానాన్ని కమల్‌ హాసన్‌ తనయ శ్రుతి హాసన్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సమంత, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ నిలిచారు. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక 5వ స్థానం దక్కింది. కాజల్‌ అగర్వాల్‌ 9లో, తమన్నా 17లో ఉన్నారు. ఈ జాబితాలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి వాద్య 20వ స్థానం కైవసం చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో తెలుగు చిన్నది ఈషా రెబ్బ 29వ స్థానంలో ఉంది. ముగ్గురు క్రీడాకారులూ ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇంకా ఎవరెవరు ఏ స్థానాల్లో నిలిచారో ఆ వివరాలు చూద్దాం..

1.శ్రుతిహాసన్‌

జనం శ్రుతిహాసన్‌కు మరోసారి ఓటు వేశారు. ఈ చెన్నై చిన్నది 2013లోనూ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌గా నిలిచింది. ఏడేళ్ల తర్వాత తాజాగా ప్రకటించిన జాబితాలోనూ అగ్రస్థానం సంపాదించుకుంది శ్రుతి. (వయసు 35ఏళ్లు)


2. సమంత అక్కినేని

‘ఏమాయ చేశావే’ చిత్రంలో ‘జెస్సీ’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సమంత. టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె అగ్రనటిగా కొనసాగుతోంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. (వయసు - 34)


3. పూజా హెగ్డే

ముంబయిలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన సినిమాలు చేస్తోంది. గత ఏడాది వచ్చిన ‘బుట్టబొమ్మ’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. (వయసు - 30)


4. రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రకుల్‌ప్రీత్‌సింగ్‌ 18 ఏళ్లకే సినిమా కెరీర్‌ ప్రారంభించింది. దిల్లీలో పుట్టిన రకుల్‌.. దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకుంది. (వయసు - 30)


5. రష్మిక మందాన

ప్రస్తుతం కుర్రకారును కవ్విస్తున్న నటి రష్మిక మందాన. ‘చలో’ సినిమాతో చూసి చూడంగానే అందరికీ నచ్చేసిందీ కన్నడ చిన్నది. తన చిలిపి చేష్టలతో నేషనల్‌ క్రష్‌గా మారింది. (వయసు - 25)


6. అదితిరావు హైదరీ

ఈమె హైదరాబాద్‌లోనే పుట్టినా చిన్నతనంలోనే దిల్లీకి మారాల్సి వచ్చింది. అదితి కేవలం నటి మాత్రమే కాదు.. డ్యాన్సర్‌, మంచి సింగర్‌ కూడా. ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఇటీవల వచ్చిన ‘వి’ లోనూ కనిపించింది. (వయసు - 42)


7. నిధి అగర్వాల్‌

నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగింది. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘ఇస్మార్ట్‌శంకర్‌’తో మంచి పేరు తెచ్చుకుంది. (వయసు - 27)


8. తన్యా హోప్

‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమందీ కన్నడ చిన్నది. తర్వాత నేను శైలజ, పటేల్‌ సర్‌, పేపర్‌ బాయ్‌, సహాయక పాత్రలు చేసింది. (వయసు - 24)


9. కాజల్‌ అగర్వాల్‌

కాజల్‌ అగర్వాల్‌.. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటుతో రికార్డు సృష్టించింది. గతేడాది గౌతమ్‌ కిచ్లూతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిందీ ముంబయి ముద్దుగుమ్మ. (వయసు - 35)


10. రాశీ ఖన్నా

దిల్లీకి చెందిన రాశీ ఖన్నా చిన్నప్పటి నుంచి క్లాస్‌టాపర్‌. చిన్న వయసులో సింగర్‌ కావాలనుకునేదట. ఆ తర్వాత ఐఏఎస్‌ కావాలని అనుకుందట. మొత్తానికి సినిమా రంగంలోకి వచ్చేసింది. (వయసు - 30)


11.శ్రద్ధా శ్రీనాథ్‌

‘జెర్సీ’ సినిమాతో అందర్నీ ఆకర్షించింది శ్రద్ధా శ్రీనాథ్‌. కశ్మీర్‌లోని ఉదమ్‌పూర్‌ చెందిన ఈ చిన్నది తన ఇంటర్‌ విద్యను సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్కూల్‌లో అభ్యసించింది. శ్రద్ధ నటించిన ‘యూటర్న్‌’(కన్నడ)ను తెలుగులో రీమేక్‌ చేశారు. అందులో సమంత నటించింది. (వయసు - 30)


12. పాయల్‌ రాజ్‌పూత్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఇందుగా అందాలు ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించిందీ దిల్లీ చిన్నది. ప్రస్తుతం సౌరవ్‌ దింగ్రాతో డేటింగ్‌ చేస్తోంది. (వయసు - 28)


13. అదాశర్మ

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది అదా శర్మ. బెల్లీ డ్యాన్స్‌ చేయడం ఈమెకు కొట్టిన పిండి. తెలుగులో ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘కల్కీ’ వంటి చిత్రాల్లో నటించింది. (వయసు - 29)


14. ప్రగ్యా జైస్వాల్‌

పుణెకు చెందిన ప్రగ్యా ‘కంచె’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలయ్య సరసన ‘అఖండ’లో ఛాన్స్‌ కొట్టేసింది. (వయసు - 30)


15.  పీవీ సింధు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన పి.వి.సింధు రాజీవ్‌ఖేల్‌ రత్న, పద్మశ్రీ, పద్మభూషన్‌ వంటి ప్రఖ్యాత అవార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సింధు బ్యాడ్మింటన్‌ కోర్టులో ఆటతో అలరించడంతో పాటు తన అందంతో ఆకట్టుకోవడంలోనూ ముందు వరుసలో ఉంటుంది. (వయసు - 25)


16.లక్ష్మీరాయ్‌ 

లక్ష్మీరాయ్‌ దాదాపు పద్నాలుగేళ్లుగా సినిమాల్లో నటిస్తోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీల్లోనూ సినిమాలు చేస్తోందీ కన్నడ సుందరి. (వయసు - 32)


17. తమన్నా భాటియా

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా.. స్కూల్‌ డేస్‌లో ఒక ఫంక్షన్‌లో చేసిన ప్రదర్శనకు గానూ సినిమా అవకాశం వచ్చిందట. అలా 15ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసింది.(వయసు - 31)


18. రహా సుఖేజా

హైదరాబాద్‌కు చెందిన మోడల్‌ రహా సుఖేజా. ఇక్కడ పెద్దగా అవకాశాలు రావడం లేదని.. ముంబయికి వెళ్లిపోయింది. (వయసు - 25)


19. మాళవిక శర్మ

చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి క్రేజ్‌ తెచ్చుకున్న నటి మాళవికశర్మ. ముంబయిలో పుట్టిన ఈ చిన్నది నేల టికెట్‌, రెడ్‌ చిత్రాల్లో నటించింది. (వయసు - 22)


20. దివి వాద్య

బిగ్‌బాస్‌4లో ప్రవేశంతో ఈమె కెరీర్‌ మలుపు తిరిగింది. మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు వరుస ఫొటో షూట్‌లతో కుర్రాకారును కవ్విస్తోంది.(వయసు - 24)


21. రితూ వర్మ

హైదరాబాద్‌కు చెందిన రితూవర్మ ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కుర్రకారు మనసు దోచుకుంది. తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారైనప్పటికీ ఆమె తెలుగు బాగా మాట్లాడుతుంది. ఇంట్లో మాత్రమే హిందీ మాట్లాడుతుందట. ‘టక్‌ జగదీశ్‌’లో నాని సరసన నటిస్తోంది. (వయసు - 31)


22. నభా నటేశ్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మంచి పేరు తెచ్చుకున్న చిన్నది నభా నటేశ్‌. డిస్కోరాజా, నన్ను దోచుకుందువటే, అదుగో, సోలోబ్రతుకే సోబెటర్‌, అల్లుడు అదుర్స్‌ చిత్రాల్లో నటించింది.(వయసు - 25)


23. సాయి పల్లవి

ఎలాంటి అందాల ఆరబోతకు తావివ్వకుండానే మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. తమిళనాడుకు చెందిన సాయిపల్లవి తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. (వయసు - 29)


24. మిథాలీ రాజ్‌

ఇండియన్‌ మహిళా క్రికెట్‌ సంచలనం మిథాలీ రాజ్‌. కుడిచేతి బ్యాటింగ్‌, లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో ఎన్నో రికార్డులు తిరగరాసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తమిళ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్‌లోనే పెరిగింది.  (వయసు - 38)


25. రాజా కుమారి

రాజాకుమార్‌ అసలు పేరు శ్వేత ఎల్లాప్రగడ. ర్యాపర్‌, సింగర్‌, లిరిక్‌ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకుందామె. అమెరికాలో ఉంటోంది. (వయసు - 35)


26. కీర్తి సురేశ్‌

తమిళనాడులో జన్మించిన కీర్తిసురేశ్‌ టాలీవుడ్‌లో ‘మహానటి’గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన అగ్రనటిగా కొనసాగుతోంది. (వయసు - 28)


27. అనుపమ పరమేశ్వరన్‌

మలయాళంలో ‘ప్రేమమ్‌’తో సినిమాల్లోకి ప్రవేశించింది అనుపమ. తెలుగులో ‘శతమానం భవతి’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటనతోనే కాదు.. తన గాత్రంతోనూ అందర్నీ ఆకట్టుకోగలదు. (వయసు - 25)


28. ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన నటించింది. ఇటీవల వచ్చిన ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’లోనూ మెరిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రియాంకకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ పేజీల పేరుతో ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంది. (వయసు - 28)


29. ఈషా రెబ్బ

అందం అభినయం ఉన్నా సరైన బ్రేక్‌ రాని హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లోనే తెరకు పరిచయమైనా ఆమెకు సరైన హిట్‌ రావడం లేదు. ఇటీవల వచ్చిన పిట్టకథలు వెబ్‌ సిరీస్‌లో అందర్నీ ఆకట్టుకుందీ వరంగల్‌ ముద్దుబిడ్డ. (వయసు - 31)


30. నిఖత్‌ జరీన్‌

నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ బాక్సింగ్‌ యువ సంచలనం. ఆమె ప్రతిభను మెచ్చి సాట్స్‌(స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌) నగదు అందజేసి ప్రోత్సహించింది. (వయసు - 24)

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని