The Family Man 2: నేను భయపడ్డా: సామ్‌

అగ్రకథానాయిక సమంత అక్కినేని కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌-2’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై...

Updated : 05 Jun 2021 11:24 IST

రాజీ పాత్ర గురించి నటి ఏమన్నారంటే

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత అక్కినేని కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌-2’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, రాజీ పాత్రకు వస్తోన్న ప్రశంసల గురించి నటి సమంత తాజాగా స్పందించారు. రాజీ తనకెంతో స్పెషల్‌ అని అన్నారు. ‘‘ది ఫ్యామిలీ మేన్‌-2’ సిరీస్‌కు వస్తోన్న కామెంట్లు, రివ్యూలు చూసి నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సిరీస్‌లో నేను పోషించిన రాజీ పాత్ర నాకెప్పటికీ ఎంతో స్పెషల్‌. ఈ సిరీస్‌ గురించి దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే నన్ను సంప్రదించినప్పుడు.. రాజీ పాత్ర పోషించడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నాను. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు.. ముఖ్యంగా మహిళల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యూమెంటరీలను క్రియేటివ్‌ టీమ్‌ నాకు పంపించింది. వాటిని చూసి నేను భయపడ్డా. వాళ్ల కష్టాలు, కన్నీటి గాథలను చూసి బాధపడ్డాను. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి, ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇది ఒక నివాళి. రాజీ కథ మనకు ఎంతో అవసరం. ద్వేషం, అణచివేత, దురాశపై పోరాడటానికి మనుషులుగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను’ అని సమంత పేర్కొన్నారు.

 The Family Man Season 2 Review: ది ఫ్యామిలీమ్యాన్‌2 రివ్యూ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు