యువకుడిలా కనిపించడానికి కష్టపడ్డా: నితిన్‌

నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, మరి కొన్నిరోజుల్లో ‘రంగ్‌ దే’...

Published : 22 Mar 2021 01:49 IST

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తిసురేశ్‌ జంటగా నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, మరి కొన్నిరోజుల్లో ‘రంగ్‌ దే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్‌ సినిమాలోని తన పాత్ర గురించి తెలియజేశారు. అలాగే చాలా కాలం తర్వాత తాను కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించడంపై స్పందించారు.

‘‘ముప్పైల వయసులో ఉన్న నేను ‘రంగ్‌దే’లో కాలేజ్‌ యువకుడిగా కనిపించాలని దర్శకుడు చెప్పగానే షాక్‌ అయ్యాను. అది సాధ్యమవుతుందా? అనే అనుమానం వచ్చింది. కానీ వెంకీ.. నచ్చజెప్పి నటించేలా చేశాడు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను కట్టిపడేసింది. దాంతో యువకుడిగా కనిపించడం కోసం ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శ్రమించా. బరువు తగ్గా.. గడ్డం తీసేశా.’’

‘‘దర్శకుడు వెంకీ అట్లూరితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. గత 12 ఏళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. నన్ను ఎలా ఉత్తమంగా చూపించాలో అతనికి బాగా తెలుసు. అలాగే ఈ సినిమాలో నేను ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తాను. కామెడీ, డ్రామా, లవ్‌.. ఇలా అన్ని కోణాలు నా పాత్రలో ఉంటాయి’’ అని నితిన్‌ తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు