Ileana: డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా: ఇలియానా

ప్రసవానంతరం తాను డిప్రెషన్‌కు గురయ్యానని, అందులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇలియానా తెలిపారు.

Published : 02 Mar 2024 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ ఇలియానా (Ileana) ప్రసవానంతరం డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రసవానంతర డిప్రెషన్‌ అన్నది వాస్తవం. అదో భావోద్వేగభరితమైన ప్రయాణం. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. అందులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. వ్యాయామం చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో అందుకు సమయం కేటాయించలేకపోతున్నా. కానీ ఒకప్పటిలా జీవించేందుకు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నా. నా కుటుంబం ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉంది. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను’’ అని ఇలియానా పేర్కొన్నారు.

‘‘ఇన్‌స్టాలో ఫొటో పెట్టి చాలా రోజులైంది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటూ తల్లిగా నా పూర్తి సమయాన్ని కోవా ఫీనిక్స్‌ డోలన్‌కు కేటాయిస్తున్నా. ఫీనిక్స్‌ నా జీవితంలోకి రావడం అందమైన విషయం. తల్లిగా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలిపేందుకు ఈ ఫొటో పెడుతున్నా. ’’అని ఇలియానా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. 

‘దేవదాస్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇలియానా గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది. ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్‌’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ఫీనిక్స్‌కు జన్మనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని