ఆక‌ట్టుకుంటోన్న ప్రియ‌ద‌ర్శి కొత్త లుక్‌

ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించిన ప్రియ‌ద‌ర్శి త్వ‌ర‌లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌(ఐఎన్‌జీ) సిరీస్‌తో ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Updated : 30 Aug 2022 14:54 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించిన ప్రియ‌ద‌ర్శి త్వ‌ర‌లో ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’ (ఐఎన్‌జీ) సిరీస్‌తో ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. నందినిరాయ్ నాయిక‌. విద్యాసాగ‌ర్ ముత్తుకుమార్ ఈ సిరీస్‌కి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ఇందులో సిగ‌రెట్ వెలిగిస్తూ సీరియ‌స్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ప్రియ‌ద‌ర్శి. నందిని రాయ్ భ‌య‌ప‌డుతూ క‌నిపించింది. అగ్నిజ్వాల‌తో కూడిన ఈ పోస్ట‌ర్ ఆసక్తి పెంచుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ఆహా ఓటీటీలో విడుద‌ల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని