‘ఇష్క్‌’ సినిమా విడుదల వాయిదా

తేజ సజ్జ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(Not a Love Story)అనేది ఉపశీర్షిక. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తోన్న ఈ  చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజు  దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 21 Apr 2021 17:36 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  తేజ సజ్జ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(Not a Love Story)అనేది ఉపశీర్షిక. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తోన్న ఈ  చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజు  దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తేజ ట్వీటర్‌ వేదికగా ప్రకటించారు. వాస్తవానికి ఏప్రిల్‌ 23న చిత్రం విడుదలకావాల్సివుంది.. వచ్చే రెండు వారాలు కరోనా చాలా తీవ్రంగా ఉండనుందని, ఇలాంటి సమయంలో సినిమాని విడుదల చేయడం మంచిది కాదు. త్వరలోనే సినిమాకి సంబంధించి కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి ఇంట్లోనే క్షేమంగా ఉండాలని సూచించింది. అంతేకాదు కరోనా బారిన పడిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఇతర బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని తెలిపారు. ‘ఇష్క్’సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాట ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.   
 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని