Jailer: ఓటీటీలోకి ‘జైలర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రజనీకాంత్‌ తన స్టైల్‌తో అలరించిన తాజా చిత్రం ‘జైలర్‌’ (Jailer). ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. 

Published : 02 Sep 2023 11:34 IST

హైదరాబాద్‌: ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించిన సినిమా ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూశారు. ఆగస్టు 10న రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా సెప్టెంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇక ‘జైలర్‌’ ఇప్పటి వరకూ రూ.600కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. 

ఆ నిస్పృహ వెంటాడేది.. అదే చివరి సినిమా కావాలనుకున్నా: పవన్‌ కల్యాణ్‌

కథేంటంటే: ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ (ర‌జ‌నీకాంత్‌) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. నీతి, నిజాయ‌తీగా ప‌నిచేసిన ఆయ‌న గురించి బాగా తెలిసిన‌వాళ్లు టైగ‌ర్ అంటుంటారు. త‌న  భార్య (ర‌మ్య‌కృష్ణ‌),  ఏసీపీగా ప‌నిచేస్తున్న త‌న‌యుడు అర్జున్‌, మ‌న‌వ‌డే లోకంగా జీవితం గ‌డుపుతుంటాడు. నేర‌స్తుల‌ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే పేరున్న అర్జున్ ప‌నితీరుని చూసి త‌నలాగే త‌న కొడుకు నీతి నిజాయ‌తీల‌తో ప‌నిచేస్తున్నాడ‌ని గ‌ర్వ‌ప‌డుతుంటాడు. ఇంత‌లోనే విగ్ర‌హాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడైన వ‌ర్మ (వినాయ‌క‌న్‌) పని వల్ల ముత్తువేల్‌ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఆ విష‌యాన్ని పోలీసులు కూడా బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి. అంత‌టితో ఆగ‌కుండా ముత్తువేలు కుటుంబాన్ని కూడా అంతం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు వ‌ర్మ‌. త‌న కుటుంబానికే అపాయం ఏర్ప‌డింద‌ని తెలుసుకున్న ముత్తు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? (Jailer movie on Amazon) అతి క్రూర‌మైన మ‌న‌స్తత్వమున్న వ‌ర్మ‌ని ముత్తు ఏం చేశాడనేది అమెజాన్‌లో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు